భద్రతాబలగాల తో జరిగిన ఎన్కౌంటర్లో యునైటెడ్ కుకీ నేషనల్ ఆర్మీకి చెందిన నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఖన్పీ గ్రామంలో 17 మంది UKNA ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు ఆర్మీ బలగాలు, అస్సాం రైఫిల్స్‌కు చెందిన పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ డాన్ పేరుతో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. దాంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాదిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

