ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగిన తర్వాత.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయాల వ్యవస్థ పేరును మారుస్తూ కూటమి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గ్రామ సచివాలయాలు ఇకపై విజన్ యూనిట్స్‌గా పిలవబడతాయని తెలిపింది. ఈ పేరు మార్పు నేటి నుంచి అమలులోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

