ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు స్పౌస్ గ్రౌండ్స్పై అంతర్ జిల్లాల బదిలీలకు ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ బదిలీలు కేవలం రిక్వెస్ట్ బేసిస్ మీద మాత్రమే జరుగుతాయి. మరోవైపు భార్య లేదా భర్త ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయితేనే ట్రాన్స్ఫర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగులు అయితే స్పౌస్ గ్రౌండ్స్ వర్తించదు, పాత జిల్లాలే ట్రాన్స్ఫర్ యూనిట్లుగా ఉంటాయి. ట్రాన్స్ఫర్లకు.. డిసిప్లినరీ కేసులు, ఏసీబీ లేదా విజిలెన్స్ కేసులు ఉన్నవారికి అవకాశం లేదు.

