దేశంలో వంట గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ఇదే పరిస్థితిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలు, మెసేజ్ యాప్స్ ద్వారా నకిలీ ప్రకటనలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. “తక్షణమే గ్యాస్ సిలిండర్ డెలివరీ”, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులు పంపిస్తూ ముందుగా ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే వెంటనే సిలిండర్ పంపిస్తామని చెప్పడం గమనార్హం. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

