పల్నాడు ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద ఓ గేదెను ఢీకొట్టింది. దీంతో ఆ గేదె సింహాద్రి ఎక్స్ప్రెస్ చక్రాల కింద ఇరుక్కుపోయింది. అప్రమత్తమైన లోకోపైలట్ రైలును నిలిపివేశారు. గేదెను ఢీకొన్న తర్వాత పల్నాడు సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇంజిన్లో సమస్యలు తలెత్తాయి. దీంతో పట్టాల మీదనే రైలు నిలిచిపోయింది. ఈ క్రమంలో నల్గొండ-మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు.

