
రాజస్థాన్‌లో కనఖేడాకు చెందిన కుటుంబం భిల్వారా జిల్లాలోని సవాయి భోజ్‌ను సందర్శించడానికి వెళ్ళింది. తిరిగివచ్చే క్రమంలో గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్ళే మార్గాన్ని సెర్చ్ చేశారు. ఆ మ్యాప్ వారిని సోమి-ఉప్రెడా కల్వర్ట్ వైపు మళ్లించింది.
అది చాలా రోజులుగా మూసివేసిన మార్గాన్ని సూచించింది. పొరబడిన డ్రైవర్ వ్యాన్‌ను కల్వర్ట్ మీదుగా తీసుకెళ్లాడు, బనాస్ నదిలో కొట్టుకుపోయారు. వ్యాన్‌లో ఉన్న తొమ్మిది మందిలో ఐదుగురిని గ్రామస్తుల సాయంతో పోలీసులు రక్షించారు.
ఒక బాలిక మరణించింది. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.
.