
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా గురువారం తల్లులకు కానుక గా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి సిఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 67 లక్షల మందికి తల్లికి వందనం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేస్తారు.