సింగరేణి సంస్థలో ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపు సాధారణంగా పారదర్శకంగా, ముందస్తు నోటీసులతో నిర్వహించడం ఆనవాయితీ. కనీసం వారం రోజుల ముందు నోటీసు జారీ చేసి, ఆసక్తి గల ఉద్యోగులు దరఖాస్తు చేసుకునేలా కౌన్సిలింగ్ జరపడం సర్వసాధారణం. అయితే, సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఇటీవల క్వార్టర్స్ కౌన్సిలింగ్ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడం పట్ల ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “జీఎం కార్యాలయంలో పనిచేసే వారికి ఒక న్యాయం, సాధారణ ఉద్యోగులకు మరో న్యాయమా?” అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

