గాజాలో శాంతి స్థాపనకు ఒకపక్క ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో మళ్లీ గాజా సిటీపై ఇజ్రాయెల్ సైనిక దళాలు శనివారం ఉదయం విరుచుకుపడడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా నగరం లోని ఉత్తర ప్రాంతంతోపాటు, దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతం కూడా దాడులకు బలైంది. గాజా సిటీ లోని ఒక అపార్ట్‌మెంట్‌పైన, అలాగే ఖాన్ యూనిస్‌లో నిర్వాసితుల శిబిరాలపై జరిగిన దాడిలో మొత్తం 12 మంది మృతి చెందారు.

