అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రహస్య జీవితాన్ని, ఆయుధాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారు. ప్రస్తుతం “గణపతి గారి ఆరోగ్యం బాగా లేదని సమాచారం ఉంది….. ఆయన లొంగిపోతే వారికి అవసరమైన వైద్యం అందిస్తాం… అవసరమైన భద్రతను కూడా కల్పిస్తాం… సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది…” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి అప్పీల్ చేశారు.

