
మంత్రి పదవి విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండగా లేనిది 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్లగొండ జిల్లాకు ముగ్గురు మంత్రులను కేటాయిస్తే తప్పేముంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంకు ఒప్పు..నల్లగొండకు తప్పా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.