
అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఎలాగో అమరావతికి క్వాంటం వ్యాలీ అలాగని, క్వాంటం శాటిలైట్ ఆవిష్కరణలతో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలకు ఆకాశమే హద్దు అని క్వాంటం కంప్యూటింగ్ ను ప్రమోట్ చేసేందుకు ముందుంటానని అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ను మనం అందిపుచ్చుకోవాలని సూచించారు. తమతో కలిసి వచ్చిన టిసిఎస్, ఐబికి, ఎల్ అండ్ టికి అభినందనలు తెలియజేశారు.