దేశవ్యాప్తంగా 24 నేషనల్ లా యూనివర్సిటీల్లో 2026-27 UG, PG లా కోర్సుల్లో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2026 అడ్మిట్‌కార్డులు తాజాగా విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్లో మొబైల్ నంబర్, పాస్వర్డ్ వివరాల లాగిన్ అయి అడ్మిట్‌కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్ 2026) డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనుంది.

