తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్టియన్ సోదరులకు ప్రభుత్వం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలను స్మరించుకుంటూ మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రేమను పంచాలని, ద్వేషించే వారిని కూడా ప్రేమించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏసుక్రీస్తు బోధనల స్పూర్తితో పనిచేస్తోందని చెప్పిన సీఎం, దుష్ప్రచారాలు, ఇబ్బందులు ఎదురైనా శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

