
ఏపీలో రాబోయే నాలుగేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా 10 లక్షల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉండవల్లి నివాసంలో ఐటీ,
ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు.