హర్యానాలో రూ.1.17 కోట్లకు అమ్ముడై, దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా నిలిచిన వీఐపీ నంబర్ ప్లేట్ HR88B8888 మళ్లీ వేలానికి సిద్ధమైంది. రోములస్ సొల్యూషన్స్ డైరెక్టర్ అయిన సుధీర్ కుమార్, అయితే రూ.1.17 కోట్ల బిడ్ మొత్తాన్ని డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటల్లోపు ఆయన చెల్లింపు చేయలేకపోయారు.బిడ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి ప్రయత్నించానని.. అది విఫలమైందని తెలిపారు. అంతేకాకుండా, నంబర్ ప్లేట్ కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడాన్ని తన కుటుంబం కూడా వ్యతిరేకించిందని తెలిపారు.

