హైదరాబాద్ లోని లక్డీకాపూల్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. కొణిజేటి రోశయ్య 92వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ సీఎంకు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తో పాటు రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

