తెలంగాణ సాధించిన కేసీఆర్పై రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని అన్నారు. జనగామ జిల్లాలో ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో కేటీఆర్ మాట్లాడుతూ… మూటలు మోసుడు తప్ప రేవంత్ రెడ్డి ఏం తెల్వదని విమర్శించారు. తెలంగాణను 60 సంవత్సరాల పాటు రాచిరంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని అన్నారు.

