తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కొండా సురేఖను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. నాంపల్లి స్పెషల్ కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.

