కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే దిల్లీలో బాంబు పేలుడు జరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఉగ్ర మూకలకు భయాన్ని కలిగించేలా, వారికి గట్టి హెచ్చరిక పంపేలా దోషులకు కఠిన శిక్షను విధించాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ లాంటి అత్యున్నత స్థాయి సంస్థలకు నెలవైన దేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. చాలా భద్రతా విభాగాలు ఉన్నప్పటికీ, దిల్లీలో బాంబు పేలుడును ఆపడంలో కేంద్ర సర్కారు విఫలమైందని ఖర్గే విమర్శించారు.

