
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చించినట్లు సమాచారం. ఏపీలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను
అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. సమారు 40 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.