
రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై చర్చించుకున్నామని ఆనాడు తెలంగాణ, ఎపి మంత్రులు మీడియాకు చెప్పారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆనాడు సిఎం కెసిఆర్ చెప్పిన అంశాలే నేడు తెలంగాణకు గుదిబండగా మారాయని మండిపడ్డారు. గోదావరి-బనకచర్ల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2019 అక్టోబర్‌లో కెసిఆర్, జగన్ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించటంపై చర్చించుకున్నారని ఎద్దేవా చేశారు.