కెన్యా తీర ప్రాంతం క్వాలేలో ఇవాళ ఓ విమానం కూలింది. మాసాయి మారా జాతీయ రిజర్వ్ ఫారెస్టుకు టూరిస్టులతో వెళ్తున్న విమానం కూలడంతో 12 మంది మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. కొండలు, అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దయాని ఎయిర్ స్ట్రిప్‌కు 40 కిలోమీటర్ల దూరంలో విమానం కూలినట్లుగుర్తించారు. ప్రమాద సమయంలో విమానంలో 12 మంది ఉన్నారు. ఏ కారణం చేత విమానం కూలిందన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.

