
కెనడాలో భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తున్న థియేటర్‌పై దుండగులు దాడి చేయడంతో కలకలం రేగింది. దక్షిణాసియాకు చెందిన సినిమాలు ప్రదర్శిస్తున్నందుకు వ్యతిరేకంగా ఈ చర్యలు జరిగినట్లు సమాచారం. ఈ హింసాత్మక ఘటనల తరువాత, థియేటర్ యాజమాన్యం తాత్కాలికంగా భారతీయ సినిమాల ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటన కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లోని ఓక్విల్ నగరంలోని Film.Ca Cinemasలో చోటుచేసుకుంది.