
ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎంపి సిఎం రమేష్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేస్తామని చెప్పలేదా? అంటూ కెటిఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. కవితను రిలీజ్ చేస్తే బిఆర్ఎస్ను విలీనం చేస్తానని చెప్పిన మాట మరిచావా?. నా వల్లే నువ్వు ఎన్నికల్లో గెలిచావు. 300 ఓట్ల మెజారిటీతో ఎలా గెలిచావు నాకు తెలుసు. నీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి.. సంస్కారం అడ్డువచ్చి చెప్పలేదు అని సిఎం రమేష్ కీలక కామెంట్స్ చేశారు.