కర్ణాటకలో హవేరికి చెందిన శంకర్‌గౌడ హదిమణి రైతుల నుంచి నేరుగా కూరగాయలు కొనుగోలు చేసి తన దుకాణంలో వాటిని విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కస్టమర్లు అధికంగా డిజిటల్ చెల్లింపులే చేస్తుండడంతో జీఎస్టీ అధికారులు అతనికి రూ. 29 లక్షల నోటీసు జారీ చేశారు.నాలుగేళ్లలో అతని అకౌంట్స్ ద్వారా రూ. 1.63 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని అధికారులు గుర్తించారు. వాస్తవానికి, ప్రాసెసింగ్ లేకుండా నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసిన తాజా కూరగాయలపై GST వర్తించదు.

