సిద్దిపేట జిల్లా ముస్త్యాల గ్రామంలో అనుముల రాకేష్ రెడ్డి (25), తరిగొప్పుల హారిక (22) ప్రేమించి పెళ్లి చేసుకోగా, కులాలు వేరు కావడంతో రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులు వీరి బంధాన్ని అంగీకరించలేదు. పోలీసులు జోక్యం చేసుకుని రాకేష్ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. త్వరలోనే వివాహం జరిపిస్తామని వారు హామీ ఇచ్చి చేయకుండా జాప్యం చేయటం తో తీవ్ర ఒత్తిడికి లోనైన రాకేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణవార్త విని తట్టుకోలేకపోయిన హారిక, వెంటనే ఉరివేసుకుని ప్రాణాలు వదిలింది.

