జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా మెయిన్ బస్ స్టాండ్లో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఆరు బస్సులు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి. సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మొత్తం ఏడు బస్సులు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, ఎవరికీ గాయాలు కూడా కాలేదు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

