ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లోని సంజయ్ వన్ వాటికను అటవీ శాఖ నిర్వహిస్తున్నది. చిన్న జూ మాదిరిగా ఉండే ఈ వనంలో పలు రకాల జింకలు ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున జింకల ఎన్‌క్లోజర్‌లోకి ఐదారు వీధి కుక్కలు చొరబడ్డాయి. అక్కడి జింకలపై దాడి చేశాయి. దీంతో మచ్చల జింక, మొరిగే జింక, నాలుగు కొమ్ముల దుప్పిలతో సహా పద్నాలుగు జింకలు శనివారం మరణించాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఒక డిప్యూటీ రేంజర్, ముగ్గురు ఫారెస్ట్ గార్డులతో సహా నలుగురిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

