
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉద్యోగాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏకంగా 3 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు,
స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీసు, ఎక్సైజ్, అటవీ శాఖ వంటి యూనిఫాం సర్వీసుల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేశారు.