ఇరాక్‌లో కిడ్నాప్ అయిన అమెరికా లేడీ జర్నలిస్టు షెల్లీ రెనీ కిటెల్సన్ ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఇంతకు ముందు కూడా ఇరాక్‌లోకి అక్రమంగా రావడానికి యత్నించారు. అయితే అప్పుడు తిప్పి పంపించారు. తరువాత స్వల్ప కాలిక ప్రవేశ అనుమతి వీసాతో ఏదో విధంగా బాగ్దాద్ చేరుకుందని. బాగ్దాద్ వీధులలో రెండు కార్ల ద్వారా ఆమెను నాటకీయంగా కిడ్నాప్ చేసినట్లు సిసిటీవీ కెమెరాలతో వెల్లడైంది. ఆమె జాడ తెలియడం లేదు. ఇరాన్ మద్దతు గల కతైబ్ హెజ్బోలా మిలిటెంట్ల ముఠా కిడ్నాప్ చేసి ఉంటారని అమెరికా అనుమానిస్తుంది.

