
సన్ టీవీ గ్రూప్‌కు సంబంధించిన వాటాల విషయంలో కళానిధి మారన్‌కు ఆయన సోదరుడు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ నోటీసులు పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కళానిధి మారన్, అతడి భార్య కావేరి కళానిధి, మరో ఆరుగురికి దయానిధి మారన్ లీగల్ నోటీసు పంపించారు. కళానిధి మారన్ 2003 నుంచి సన్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సన్ గ్రూప్, దాని సంబంధిత కంపెనీలలో వాటాల తీరును 2003 నాటి స్థితికి మార్చాలని డిమాండ్ చేశారు.