తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సభలో కేవలం సూచనలు ఇచ్చి పారిపోవడం బీజేపీ సభ్యులకు అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణను ఇప్పటికే సిబిఐకి అప్పగించామని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

