హైదరాబాద్‌లో కాల్పుల కలకలం రేగింది. మణికొండ పంచవటి కాలనీలో ఓ స్థల వివాదానికి సంబంధించి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు గాల్లోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. పంచవటి కాలనీలో ఉన్న తమ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్ బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. ఖాళీ చేస్తారా..? లేదా అంటూ ప్రభాకర్ తన గన్‌తో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.

