
మమ్ముట్టి సేవలను గౌరవిస్తూ కేరళలోని మహారాజ్ కాలేజీ బీఏ హిస్టరీలోని ఆయన కెరీర్‌పై పాఠ్యాంశాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ‘సెన్సింగ్ సెల్యులాయిడ్: హిస్టరీ ఆఫ్ మలయాళం సినిమా’ పేరుతో ఓ చాప్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మమ్ముట్టి జీవితం, సినీ కెరీర్, సినిమాపై అతని ప్రభావం గురించి బీఏ హిస్టరీ విద్యార్థులు తెలుసుకుంటారు. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే… మమ్ముట్టి కూడా ఈ కాలేజీ విద్యార్థే.