
కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కోర్ సిటీ ఏరియాలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా మార్చడంతో పాటు 25 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.