ఏపీలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది. అజెండా అంశాలు ముగిశాక వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. కార్యదర్శుల పనితీరు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీ ప్రారంభమైనా అజెండా మంత్రులకు రాలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. అజెండా ముందే వస్తే.. స్టడీ చేసుకుని వచ్చే వీలు ఉండేదన్నారు. వ్యవస్థలు ఉపయోగపడాల్సిందిపోయి.. క్లిష్టంగా మారుతున్నాయని సీఎం చెప్పారు. ఆయా శాఖల కార్యదర్శులు గతంలో సందేహాలు నివృత్తి చేసేందుకు చొరవ చూపేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

