వరంగల్‌లోని ప్రముఖ వైద్య విద్యాసంస్థ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను హాస్టల్ టెర్రస్‌పైకి తీసుకెళ్లి మోకాళ్లపై కూర్చోబెట్టి అవమానించారని ఫిర్యాదులు వచ్చాయి. సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు థర్డ్ ఇయర్ విద్యార్థుల గురించి గ్రూప్‌లో తప్పుగా పోస్టులు పెట్టారనే ఆరోపణలతో సుమారు 20 మంది జూనియర్ విద్యార్థులను టెర్రస్‌కు తీసుకెళ్లి క్షమాపణ చెప్పించారని తెలుస్తోంది. కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ అనంతరం ఏడుగురు సీనియర్ విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు

