తిరుమల తిరుపతి దేవస్థానం లో లడ్డూ ప్రసాద తయారీకి వాడిన కల్తీ నెయ్యి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మరో కీలక అరెస్టు చేసింది. టీటీడీ మాజీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ను ఈరోజు అరెస్టు చేశారు. మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న తో కలిసి కల్తీ నెయ్యి సరఫరాలో కుట్రలకు పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ అరెస్టుతో కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది.

