
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు మోదీకి స్వాగతం పలికారు. ఇక విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో ప్రధాని సున్నిపెంట చేరుకోనున్నారు. రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి వెళ్తారు. మధ్యాహ్నం 12.05 గంటల వరకు శ్రీశైల మల్లన్న సన్నిధిలో పూజలు చేస్తారు.