
మద్రాస్ హైకోర్టు లో టీవీకే పార్టీ కి చుక్కెదురైంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌పై శుక్రవారం మదురై బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా విజయ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కరూర్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది.
ఈ సందర్భంగా కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని వ్యాఖ్యానించింది.