
కన్నప్ప మూవీలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పాత్రల పేర్లు తమ మనోభావాలు దెబ్బతీశాయని.. ఆ పేర్లను తొలగించకుంటే.. రిలీజ్ అడ్డుకుంటామని బ్రాహ్మణ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. ఇటీవల గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఆందోళన నిర్వహించారు. ‘కన్నప్ప’ మూవీలో పేర్ల వివాదంపై మంచు విష్ణు స్పందించారు. తాము ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో సినిమా తీయలేదని.. రిలీజ్ కాకముందే ఓ నిర్ణయానికి రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు.