కర్నాటకలో కమల్ హాసన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. థగ్‌లైఫ్ సినిమా ప్రమోషన్లో కన్నడ భాష పుట్టుకపై సంచలన కామెంట్స్ చేశాడు కమల్ హాసన్. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ కమల్ వ్యాఖ్యానించడంతో.. కన్నడ భాషాభిమానులు కన్నెర్రజేశారు ..కమల్ వ్యాఖ్యలపై కన్నడ పరిరక్షణ వేదిక తీవ్రంగా మండిపడుతోంది. కమల్ థగ్‌లైఫ్ సినిమాను కర్నాటకలో నిషేధించాలని.. ఆయన సినిమాలను కర్నాటకలో ఆడనివ్వబోమని హెచ్చరిస్తున్నారు

