విజయవాడ నుండి విస్సన్నపేట వెళ్లే ఆర్టీసీ బస్సు (నెం. 308)లో ఇద్దరు మహిళలు ఉచిత ప్రయాణం కోసం ఆధార్ కార్డులు చూపించాల్సి ఉండగా, ఇద్దరు కలిసి మూడు కార్డులను అందించారు. “మీరు ఇద్దరే కదా, మూడు కార్డులు ఎందుకు ఇస్తున్నారు?” అని కండక్టర్ ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. మాటామాటా పెరిగి, ఆగ్రహానికి గురైన ఓ మహిళ అందరి ముందే కండక్టర్ చెంపపై లాగి కొట్టింది. పోలీసుల విచారణలో.. కండక్టర్ తనను అసభ్యంగా దూషించారని, అందుకే చేయి చేసుకోవాల్సి వచ్చిందని మహిళ ఆరోపించారు.

