మధ్యప్రదేశ్‌లో రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి జరుగుతోందన్నారు. హర్యానా మాదిరే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోనూ ఓట్ల చోరీ జరిగిందని ఇందుకు సంబంధించిన ఆధారాలు వాటిని త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ఓటు చోరీని కప్పిపుచ్చుకునేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించారని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ, ఈసీ ఉమ్మడి భాగస్వామ్యంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.

