ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాలో ఎలాంటి అవకతవకలు జరిగినా దానిని వెంటనే పార్టీ నేతలు సవాలు చేయాలని కాంగ్రెస్ కోరింది. ముసాయిదా జాబితా నుంచి ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా తొలగించినా, బోగస్ ఓటర్లను చేర్చినా వెంటనే అభ్యంతరాలు లేవనెత్తాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. ఎస్ఐఆర్, ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో డిసెంబర్ ప్రథమార్ధంలో ర్యాలీ నిర్వహించాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది.

