అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు పసిడి, వెండి రేట్స్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. నేడు మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1040 మేర పెరిగి రూ.1,47,280ల రికార్డు స్థాయికి చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.1,35,000కు ఎగబాకింది. నగరంలో వెండి ధర కూడా చుక్కలనంటింది. ఒక్కరోజులో ఏకంగా రూ. 12 వేల మేర పెరిగి రూ.3,30,000కు చేరుకుంది

