భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూపీఐ (UPI) సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆగస్టు 2న ఒక్క రోజులోనే యూపీఐ ద్వారా ఏకంగా 70.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2024 ఆగస్టులో రోజుకు 50 కోట్లుగా ఉన్న లావాదేవీల సంఖ్య,
సరిగ్గా ఒక సంవత్సరంలోనే 70 కోట్ల మార్కును దాటడం డిజిటల్ చెల్లింపుల పట్ల ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. 2026 నాటికి రోజుకు 100 కోట్ల లావాదేవీలు జరగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

