ఐశ్వర్య రాయ్ (జననం 1 నవంబరు 1973), ప్రముఖ భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి. 1994వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికయ్యారామె. ఆమె ఎన్నో సినిమాల్లోనూ యాడ్ లలోనూ నటించారు. ఫిలింఫేర్ పురస్కారాల నామినేషన్ తో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ఐశ్వర్య. 2009లోభారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ప్రపంచంలోని అత్యంత అందమైనవారిలో ఒకరిగా ఐశ్వర్యను పేర్కొంటుంటారు

