దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓ వైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, ఇదొక ‘ఎకనామిక్ మిరకిల్’ అని అభివర్ణించారు. ఐరోపా దేశాలు సరైన దిశలో వెళ్లడం లేదని, అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నాటో కూటమి దేశాలు రక్షణ వ్యయం విషయంలో అమెరికాపై భారం మోపుతున్నాయని, తాము రక్షణ కల్పిస్తున్నా తగిన మూల్యం చెల్లించడం లేదని మండిపడ్డారు. గ్రీన్లాండ్ ప్రతిపాదనను తిరస్కరించడం పట్ల, వారు కృతజ్ఞత లేనివారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

